Pakistan breaks Ceasefire : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ కాల్పుల విరమణ(Pakistan breaks Ceasefire)కు తూట్లు పొడిచింది. అఫ్గనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా గగనతల దాడులకు పాల్పడింది. ఇరుదేశాల మధ్య కుదిరిన రెండు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది దేశం. డ్యూరాండ్ లైన్(Durand Line) వెంబడి ఉన్న మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడిందని శుక్రవారం తాలిబన్ సీనియర్ నేత ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ (AFP)తో వెల్లడించారు. తాము పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.
‘పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఇరుదేశాల సరిహద్దులోని పక్తికా (Paktika) ప్రావిన్స్‌లోని అర్గున్, బెర్మల్ జిల్లాలోని పలు ఇళ్లపై మూడు ప్రాంతాల్లో బాంబులతో దాడి చేసింది. ఈ చర్యకు అఫ్గనిస్థాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది’ అని ఆ నేత పేర్కొన్నాడు. అయితే.. పాక్ దాడిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించిన వివరాలను మాత్రం తాలిబన్ నాయకుడు వెల్లడించలేదు.
Pakistan just violated the ceasefire with by bombing Urgun, Paktika! Many women and children have been moved to the local hospital!@ObaidullaBaheer pic.twitter.com/NXNvQra7pB
— Insaf Marwat (@abakheli) October 17, 2025
ఇరుదేశాల నడుమ ఉద్రికత్తలను చర్చల ద్వారా తగ్గించుకునేందుకు రెండు దేశాల నాయకులు శనివారం ఖతార్‌లోని దోహాలో సమావేశం కానున్నారు. ఇప్పటికే పాక్ ప్రతినిదులు దోహా చేరుకున్నారు. అఫ్గన్ టీమ్ ఇంకా బయల్దేరాల్సి ఉంది. ఆలోపే పాక్ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం గమనార్హం.