SLW vs SAW : వర్షం అంతరాయంతో ఐదు గంటలు ఆలస్యంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka) మోస్తరు పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం 20 ఓవర్లకు కుదించడంతో.. మిడిలార్డర్ బ్యాటర్లు ధనాధన్ ఆడారు. విష్మీ గుణరత్నే(34), నీలాక్షి డిసిల్వా(18)లు బౌండరీలతో చెలరేగి జట్టు స్కోర్ దాటించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 40 రన్స్ జోడించారు. అయితే.. మ్లాబా వేసిన ఆఖరి ఓవర్లో డిసిల్వా, అనుష్కా సంజీవని(1), గుణరత్నేలు ఔట్ కావడంతో.. నిర్ణీత ఓవర్లలో లంక 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగలిగింది.
వరల్డ్ కప్ పదమూడో సీజన్లో బోణీ కొట్టేందుకు ఎదురుచూస్తున్న శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విష్మీ గుణరత్నే (34), చమరి ఆటపట్టు (11)లు శుభారంభం ఇచ్చారు. కానీ, నాలుగో ఓవర్లోనే గుణరత్నే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హాసిని పెరీరా(4)ను మసబతా క్లాస్ బౌల్డ్ చేసి తొలి వికెట్ అందించింది. కాసేపటికే చమరి ఆటపట్టును ఎల్బీగా పంపిన క్లాస్.. లంకకు భారీ షాకిచ్చింది. కీలక వికెట్లు పడిన వేళ .. కవిశ దిల్హరి(14), హర్షిత మాధవి (13)లు జట్టును ఆదుకునే ఇన్నింగ్స్ ఆడుతుండగా.. 12వ ఓవర్ పూర్తి కాగానే వర్షం మొదలైంది. వాన పెద్దగా పడడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికీ లంక స్కోర్ 46\2.
105 on the board for Sri Lanka and we’ll know the DLS adjusted target soon 👇 #SLvSA scorecard: https://t.co/Gmw7BXwnvu pic.twitter.com/pDP2NPlPpD
— ESPNcricinfo (@ESPNcricinfo) October 17, 2025
ప్రపంచ కప్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను రద్దు చేయించిన వరుణుడు మరోసారి శ్రీలంకను భయపెట్టాడు. అసలే బోణీ కోసం నిరీక్షిస్తున్న ఆతిథ్య జట్టుకు షాకిస్తూ ఏకధాటిగా కుండపోత కురిపించాడు. దాంతో.. మ్యాచ్ సాగడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే.. ఎట్టకేలకు ఐదు గంటల తర్వాత మైదానం సిబ్బంది సూపర్ సాపర్స్ సాయంతో ఆటకు అంతా సిద్దం చేశారు. ఐదు గంటల మ్యాచ్ జరుగనందున డకవర్త్ లూయిస్ ప్రకారం 20 ఓవర్ల మ్యాచ్ ఆడిస్తున్నారు. దాంతో.. 46/2తో శ్రీలంక ఇన్నింగ్స్ కొనసాగించింది. తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన కవిష దిల్హరి(14) ఔటయ్యింది. డీక్లెర్క్ ఓవర్లో మిడాన్‌లో షాట్ ఆడిన ఆమె లారా వొల్వార్డ్త్ చేతికి చిక్కింది.
After a FIVE HOUR pause, we resume 💪
Match restarts at 21.10 local time. 20 overs a side: https://t.co/6WKrQ2eWrv pic.twitter.com/3HE1INXzHT
— ESPNcricinfo (@ESPNcricinfo) October 17, 2025
ఆ తర్వాత మ్లాబా ఔలింగ్‌లో మాధవి (13) సైతం అదే దిశలో బంతిని గాల్లోకి లేపి.. సఫారీ కెప్టెన్‌కు దొరికిపోయింది. దాంతో.. 63 వద్దే లంక నాలుగు వికెట్లు పడ్డాయి. ఫామ్‌లో ఉన్న ఇద్దరూ ఔటవ్వడంతో నీలాక్షి డిసిల్వా(6), విష్మీ గుణరత్నే(22)లు దూకుడుగా ఆడారు డీక్లెర్క్ బౌలింగ్‌లో.. డిసిల్వా రెండు ఫోర్లు, ఆ తర్వాతి మ్లాబా బౌలింగ్‌లో గుణరత్నే రెండు బౌండరీలు బాదగా స్కోర్ వందకు చేరువైంది. అయితే.. చివరి ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన డిసిల్వా బౌండరీ లైన్ వద్ద బాస్చ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత సంజీవని, గుణరత్నేలు సైతం ఔట్ కావడంతో లంక 105 పరుగులకే పరిమితమైంది.