వింటర్ ఒలింపిక్స్ ఆరంభవేడుకల్లో పాల్గొంటున్నా.. పాక్ ప్రధాని ఇమ్రాన్
ఇస్లామాబాద్: అంతా ఒక దారిలో పోతే.. తాను మరో దారిలో వెళ్తా అంటున్నది పాకిస్థాన్. బీజింగ్‌లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics) ఆరంభ వేడుకలకు తాను హాజరవుతున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీనికోసం తాను గురువారం చైనాకు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో వింటర్ ఒలింపిక్స్ వేడుకలను చాలా దేశాలు ఇప్పటికే బహిష్కరించాయి. తాము కానీ, తమ రాయబారులు కానీ ఆరంభ వేడుకల్లో పాల్గొనేది లేదని ఆయా దేశాల ప్రభుత్వాధినేతలు ప్రకటించారు.
తాను ఫిబ్రవరి 3 నుంచి 6వ తేదీవరకు చైనాలో పర్యటిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో పాల్గొంటానని, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధాని లి కెక్వియాంగ్తో సమావేశమవుతానని వెల్లడించారు. ఇరు దేశాల వాణిజ్యపరమైన, రక్షణ, తదితర అంశాలను చర్చించనున్నట్లు చెప్పారు.
వింటర్ ఒలింపిక్స్‌కు బీజింగ్ ఆతిథ్యం ఇస్తున్నది. ఫిబ్రవరి 4న ఆరంభ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్నది. ఇందులో ఆ దేశ అధ్యక్షుడితోపాటు ప్రభుత్వ పెద్దలు పాల్గొననున్నారు. వీరితోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఐక్యారజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ సహా వివిధ దేశాలకు చెందిన 32 మంది నాయకులు పాల్గొంటారని ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, చైనాలో భారీగా అణచివేతలు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతుండటంతో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ సహా పలు దేశాలు బీజింగ్ ఒలింపిక్స్ ఆరంభ వేడులకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

