సుల్తానాబాద్ రూరల్ : రెక్కాడితే డొక్కాడే చేనేత కార్మికులు (Padmasali workers) దుర్బర జీవితం గడుపుతున్నారని , ప్రభుత్వం వారిని ఆదుకొని అండగా ఉండాలని పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అడ్‌హక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య ( Chairman Valasa Neelaiah ) అన్నారు.
సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, తొగర్రాయి, కనగర్తి గ్రామలకు చెందిన 70 మంది చేనేత కార్మికులను శ్రీ వెంకటేశ్వర చేనేత పారిశ్రామిక సహకార సంఘం కనుకులలో బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా ఘనంగా సన్మానించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ చేనేతలకు సబ్సిడీపై యంత్రాలతోపాటు పనిముట్లు అందించాలని కోరారు.
సైకిల్‌పై తిరుగుతూ బట్టలు విక్రయిస్తున్న పద్మశాలి కులస్తులకు సబ్సిడీపై మోపెడ్లు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో పద్మశాలీలకు రైతన్నల మాదిరిగా ప్రాధాన్యత ఇచ్చి విధాలుగా ఆదుకోవాలని కోరారు. చేనేత వృత్తిలో రాణిస్తున్న పద్మశాలీలను సన్మానించడం గర్వకారణమని అన్నారు.
కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడెపు సుధాకర్, పెద్దపల్లి టౌన్ అధ్యక్షులు బత్తుల రమేష్, జాతీయ చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులు కోమటిపల్లి సదానందం, తెలంగాణ పద్మశాలి సేవా సంఘం ప్రచార కార్యదర్శి పేగడ చందు, ఓదెల పద్మశాలి సంఘం అధ్యక్షులు పర్ష రమేష్, సహకార సంఘం కార్యదర్శి సిరిపురం అంజయ్య, ఆడెపు చంద్రమౌళి, దిడ్డి తిరుమల్ దాస్ తదితరులు పాల్గొన్నారు.