మెదక్ : రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా రామాయంపేట మండలం రైలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద పద్మా దేవేందర్ రెడ్డి నాయకత్వంలో రాస్తారోకో చేయడంతో గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుజేసి పంటలు పండిస్తే ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షానికి నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్ గౌడ్, నిజాంపేట్ ఎంపీపీ సంపత్, సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, మాజీ సర్పంచ్ నర్స గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యం, బిక్షపతి, నాయకులు ఉమామహేశ్వర్, అబ్దుల్ అజిజ్, హస్నోద్దీన్, రొయ్యల నవీన్, మధుకర్ రాంకీ శ్రావణ్, మహేష్, రంజిత్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.