రోమ్: శ్రీలంక అథ్లెట్, జావెలిన్ త్రోయర్ రుమేశ్ పథిరగే(Rumesh Pathirage) స్టన్నింగ్ రికార్డు క్రియేట్ చేశాడు. రోమ్‌లో జరిగిన వాండా డైమండ్ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. అతను జావెలిన్‌ను 92.62 మీట్ల దూరం విసిరాడు. అయితే ఆసియా త్రోయర్లలో ఇప్పుడు రమేశ్ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్, భారత త్రోయర్ నీరజ్ చోప్రా మధ్యలో లంక అథ్లెట్ చేరాడు. 2024 ఒలింపిక్ ఫైనల్ తర్వాత పథిరగే తొలిసారి ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు. రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఆండర్సన్ పీటర్స్ డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను కేవలం 83.91 మీటర్ల దూరం మాత్రమే విసిరాడు. ఇక ప్రపంచ పోటీల్లో కాంస్య పతకం గెలిచిన కుర్టిస్ థాంప్సన్ ఈసారి జావెలిన్‌ను 83.89 మీటర్ల దూరం విసిరి మూడవ స్థానంలో నిలిచాడు.
శ్రీలంక క్రీడాకారుడు తన తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 84.49 మీటర్ల దూరం విసిరాడు. ఇక తన రెండో ప్రయత్నంలో జావెలిన్ ను 90 మీటర్లు దాటించాడు. ఈ క్రమంలో అతను జావెలిన్‌ను 90 మీటర్ల దూరం విసిరిన ఆసియా వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో వాడా డైమండ్ లీగ్‌లో 20 ఏళ్ల క్రితం ఆండ్రియాస్ థార్కిడ్ సన్ నమోదు చేసిన 90.34 మీటర్ల రికార్డును రుమేశ్ దాటేశాడు.అయితే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ లంక అథ్లెట్ తన జావెలిన్‌ను 92.62 మీటర్ల దూరం విసిరాడు.
తాజా ఫీట్‌తో లంక అథ్లెట్ తన ఖాతాలో కొత్త రికార్డు వేసుకున్నాడు. జావెలిన్‌ను 90 మీటర్ల మార్క్ దాటించిన నాలుగవ ఆసియా క్రీడాకారుడిగా నిలిచాడు. గతంలో చైనీస్ తైపియి అథ్లెట్ చెంగ్ చావో సున్(91.36), నీరజ్ చోప్రా(90.23), ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ ఉన్నారు.
🚨RUMESH THARANGA PATHIRAGE 🇱🇰 FAIT SON ENTRÉE DANS LE CLUB DES 92M AU JAVELOT :
Le sri-lankais frappe un grand coup en réalisant 92.62M MR WL NR. Il devient ainsi le HUITIÈME meilleur performeur de l’histoire du lancer du javelot ! 🤯#Athlétisme #RomeDL pic.twitter.com/nuQTHoHnA1
— MR.CARTER 🌚 (@NelsonCarterJr) June 4, 2026