ముంబై: తమ ప్రియురాళ్లకు ఐఫోన్లు కొనేందుకు ఇద్దరు యువకులు ఒక వేర్‌హౌస్‌లోకి చొరబడ్డారు. రూ.6.5 లక్షల విలువైన కుళాయిలను దొంగిలించారు. ఆ షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. (Boys Steal Taps) ఆ యువకులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. తమ లవర్స్‌కు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇవ్వాలని ఇద్దరు యువకులు భావించారు. దీంతో మే 27న అర్ధరాత్రి తర్వాత టైల్స్, శానిటరీ సామాగ్రి విక్రయించే షాపు గిడ్డంగిలోకి వారు ప్రవేశించారు. రూ.6.5 లక్షల విలువైన 21 డిజైనర్ ట్యాప్స్‌ను దొంగిలించారు.
కాగా, వేర్‌హౌస్ యజమాని ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ షాపుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితులైన ఇద్దరు మైనర్ బాలురను గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

Boys Steal Taps
మరోవైపు తమ ప్రియురాళ్లకు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఖరీదైన డిజైనర్ ట్యాప్స్‌ను చోరీ చేసినట్లు ఆ యువకులు తెలిపారు. అయితే ఇర్ఫాన్ అలీ అలియాస్ ఇమ్ము రంజాన్ అలీ అనే వ్యక్తికి కేవలం రూ.20,000కే వాటిని అమ్మినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6.5 లక్షల విలువైన డిజైనర్ కుళాయిలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.