సిద్దిపేట, మే 15: హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట అని, విజయవాడ కృష్ణానదిపై జరిగే తెప్పోత్సవం ఆరేండ్లుగా మన సిద్దిపేటలో జరుపుకోవడం ఆంజనేయుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం రామరాజు రావిచెట్టు హనుమాన్ ఆలయం ట్రస్, హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెప్పోత్సవాన్ని ఆరేండ్లుగా సిద్దిపేటలో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. దేశంలో హనుమాన్ మాల ఎకువ వేసుకునేది మన సిద్దిపేటలోనేనని, హనుమాన్ దీక్షకు భిక్ష కార్యక్రమం ఎకడ మొదలైంది అంటే సిద్దిపేటలోనే అన్నారు.
ఈ దీక్షను మొదట సిద్దిపేటలో ప్రారంభించారన్నారు. సిద్దిపేట ధార్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరని, అమర్నాథ్, కేదార్నాథ్ అన్నదాన సేవలు నిర్వహిస్తున్నది మన సిద్దిపేట ధార్మిక సంస్థలేనన్నారు. ధార్మిక కార్యక్రమం ఏదైనా సరే సిద్దిపేట ముందుంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎకడైతే హనుమంతుడి పూజ జరుగుతుందో, ఎకడైతే హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుందో అకడి ప్రజలకు హనుమంతుడు కొండంత ధైర్యాన్ని ఇస్తాడన్నారు. తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదన్నారు. దేవుళ్లకే సహాయం చేసిన అంజన్న మనుషులకు సహాయం చేయరా అన్నారు.
ప్రతిరోజూ మన జీవితంలో ఆంజనేయుడి పూజా కార్యక్రమం నిర్వహించుకొని, హనుమాన్ చాలీసా పఠించాలన్నారు. దుర్గాప్రసాద్ స్వామీజీకి మన సిద్దిపేట అంటే ఎంతో అభిమానం అన్నారు. ఈ సంవత్సరం సిద్దిపేటకు వచ్చి ఒకరోజు మాల వారి చేతి మీదుగా వేసుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. అంజన్న దయతో మళ్లీ మన తెలంగాణకు మంచి భవిష్యత్తు రావాలన్నారు. ఇకడ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని హరీశ్‌రావు అన్నారు. మన దేశం ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంత దేశంగా ఎదగాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం, మన రాష్ట్రం వికసిల్లాలని కోరుతూ మరోసారి ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన దుర్గాప్రసాద్ స్వామీజీకి కృతజ్ఞతలు తెలిపారు.