న్యూఢిల్లీ : వైద్యులు జనరిక్ మందులను మాత్రమే సూచించడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేసినపుడు, వారికి ఫార్మా కంపెనీలు లంచాలు ఇస్తున్నారనే సమస్య పరిష్కారమవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వాదన ప్రకారం అధిక, అహేతుక మందులను, మితిమీరిన ధరలు గల బ్రాండ్లను సూచించేందుకు వైద్యులకు ఔషధ తయారీ కంపెనీలు లంచాలు ఇస్తున్నాయి. యూనిఫాం ఫార్మాస్యుటికల్ మార్కెటింగ్ కోడ్‌కు చట్టబద్ధత కల్పించే వరకు, ఔషధ తయారీ కంపెనీలు అనైతిక మార్కెటింగ్ విధానాలకు పాల్పడకుండా కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టును కోరారు. తగిన సవరణలతో ఈ కోడ్‌ను అందరికీ వర్తించే విధంగా ఆదేశించాలని కోరారు.