తిరువనంతపురం : రెండు నెలల పాటు జరిగే శబరిమల వార్షిక యాత్ర ప్రారంభానికి కొద్ది రోజులే ఉన్న క్రమంలో అయ్యప్ప భక్తులకు శబరిమలలోని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీవోబీ) శుభవార్త తెలిపింది. భక్తులు ఈ నెల ఐదు నుంచి పూజా, ఇతర కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అలాగే సన్నిధానం, టెంపుల్ కాంప్లెక్స్‌లలో వసతి సౌకర్యానికి సంబంధించి కూడా బుధవారం నుంచి ఆన్లైన్లో www.onlinetdb.com వెబ్సైట్ ద్వారా బుక్చేసుకోవచ్చునని వివరించింది.