న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, తిప్ర మోతా చైర్పర్సన్ ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేవ్‌వర్మ, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మ్మోన్లుమోకికోస్ మంగళవారం కొత్త ప్రాంతీయ రాజకీయ వేదికను ఏర్పాటుచేసే ప్రణాళికను ప్రకటించారు.
ఈశాన్యంలోని విభిన్న స్వరాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేఘాలయ ముఖ్యమంత్రి తెలిపారు.