కాబూల్ : గత నెలలో పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో చిన్నపాటి యుద్ధానికి దిగిన అఫ్ఘానిస్థాన్, తాజాగా గ్రేటర్ అఫ్ఘానిస్థాన్ మ్యాప్ పేరుతో మరో వివాదానికి తెరలేపింది. అఫ్ఘాన్‌లోని రెండు సంస్థల విద్యార్థులు ఇటీవల తాలిబన్ ఉప మంత్రి మహ్మద్ నబీ ఒమరీకి గ్రేటర్ అఫ్ఘానిస్థాన్ మ్యాప్‌ను బహూకరించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు భూభాగాలను అఫ్ఘాన్‌లో భాగంగా చూపారు.