థాణే : రైలు ప్రమాదానికి బాధ్యులను చేస్తూ రైల్వే చరిత్రలో తొలిసారిగా ఇద్దరు రైల్వే ఇంజినీర్లపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ప్రత్యక్ష చర్య తీసుకున్నారు. థాణేలోని ముంబ్రా స్టేషన్ సమీపంలో జూన్ 9న జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
ఈ ప్రమాదానికి ప్రధాన నిందితులుగా చేస్తూ అసిస్టెంబ్ డివిజనల్ ఇంజినీర్ విశాల్ డోలస్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సమర్ యాదవ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.