వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదిత రేటింగ్ కొత్త కనిష్ఠ స్థాయికి చేరుకుంది. కేవలం 37 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఆయన పనితీరును ఆమోదిస్తున్నారు. ట్రంప్‌కు ఇప్పటివరకు నమోదైన అత్యల్ప రేటింగ్లలో ఇది ఒకటి.
సీఎన్ఎన్/ఎస్ఎస్ఆర్ఎస్ పోల్ అందించిన ప్రకారం ఫిబ్రవరి నుంచి ఇది అత్యంత తగ్గుదల అని పేర్కొంది. జనవరిలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇది 47 శాతం ఉండగా, ఇప్పుడది 37 శాతానికి దిగజారింది.