హైదరాబాద్ : శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 34,277 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. ప్రస్తుతం జలాశయం దాదాపు పూర్తిస్థాయిలో నిండడంతో అధికారులు దిగువకు 72,339 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.90 అడుగులు ఉన్నది. కుడి, ఎడమ గట్టుల్లో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.