ఓఎన్జీసీ ఉద్యోగిని విడుదల చేసిన ఉల్ఫా
ఓఎన్జీసీ ఉద్యోగిని విడుదల చేసిన ఉల్ఫా | గత నెల 21న అపహరించిన ఓఎన్జీసీ ఉద్యోగి రితుల్ సైకియాను యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) నెల రోజుల తర్వాత విడుదల చేసింది.

గువాహటి : గత నెల 21న అపహరించిన ఓఎన్జీసీ ఉద్యోగి రితుల్ సైకియాను యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) నెల రోజుల తర్వాత విడుదల చేసింది. జోర్హాట్ జిల్లాలోని టైలాబోర్ నివాసి అయిన సైనియాతోపాటు మరో ఇద్దరు అధికారులను శివసాగర్ ప్రాంతంలో ఉల్ఫా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మోన్ జిల్లాలోని ఓ గ్రామంలో సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు అధికారులను సైన్యం, నాగాలాండ్ పోలీసులు రక్షించారు. తాజాగా రితుల్ సైకియాను నాగాలాండ్‌లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో శనివారం ఉదయం విడుదల చేశారు. దీంతో ఆయన మోన్ జిల్లాలోని అసోం రైఫిల్ పోస్టుకు చేరుకున్నారు. భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత నాగాలాండ్ పోలీసులు అతన్ని మోన్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు విచారించి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు. సైకియా విడుదలపై సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. ప్రతిఒక్కరి సహకారంతో రాష్ట్రంలో శాంతి నెలకొందని, అభివృద్ధి జరిగిందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత
నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
తెలంగాణకు వర్ష సూచన
భారత విమానాలపై నిషేధం పొడగించిన కెనడా
ఆ కంటెంట్‌ను తొలగించాలి.. సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశం
విలక్షణ నటుడు చంద్రమోహన్ జన్మదినోత్సవాలు
దేశంలో కొత్తగా 2.57 లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
Vaccination @ 126 Day’s.. 19.32 కోట్ల డోసుల పంపిణీ
ఆన్లైన్ పాఠాలు బాగు
‘ఎయిరిండియా’పై సైబర్ ఎటాక్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Assam
- ONGC Employee
- Released
- ULFA-I
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

