కొమరం భీం ఆసిఫాబాద్ : సిర్పూర్ (టి) మండల కేంద్రానికి చెందిన షేక్ జంషెద్ (44) అనే రైల్వే లేబర్ బుధవారం తెల్లారుజామున రైలు( Train ) ఢీకొని మృతి చెందాడు. రైల్వే గార్డు ( Railway Guard) , సిబ్బంది నిర్లక్ష్యంతోనే జంషేధ్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు, గ్రామస్థులు మృతదేహంతో సిర్పూర్ టీ- కౌటల ప్రధాన రహదారిపై ఆందోళన ( Agitation ) నిర్వహించారు. మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని రోడ్డుపై బైఠాయించారు.
దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించడంతో కౌటల సీఐ సంతోష్ కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు రైల్వే లేబర్ కాంట్రాక్టర్ మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.