హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగా ణ): ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు చేయూత పింఛన్లు పెంచకుంటే ఉద్యమిస్తామ ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లోని సెర్ప్ కార్యాల యం ఎదుట ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించి సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భం గా అడివయ్య మాట్లాడుతూ జూన్ 2న కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. మాట తప్పిన సీఎం పర్యటనలను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.