Telangana | హైదరాబాద్,(నమస్తే తెలంగాణ) ; ఏడాది కిందటి వరకు.. తెలంగాణ అంటే పెట్టుబడుల గమ్యస్థానం. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షించిన రాష్ట్రం. పదేండ్లలోనే రూ. 2.66లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, దాదాపు 18లక్షల ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం. కానీ.. ఏడాదిలోనే సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాల ఫలితంగా కొత్త కంపెనీలు రాకపోగా.. గతంలో వచ్చిన పెట్టుబడులు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. పరిశ్రమలకులో ఓల్టేజీ, కరంటు కోతలు మొదలయ్యాయి. వరుస వివాదాలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశాయి.
పరిశ్రమలు వెనక్కి.. ఫార్మా.. ఆగమాగం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలంలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదు. పైగా రెండు భారీ పరిశ్రమలు వెనక్కు తరలివెళ్లాయి. గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ కార్నింగ్ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. కంపెనీ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఇప్పుడు చెన్నైకి తరలివెళ్లింది.
సెమీ కండక్టర్ల తయారీ దిగ్గజం కేన్స్ సెమికాన్ కంపెనీది ఇదే పరిస్థితి. రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. కానీ.. ఇప్పుడు గుజరాత్ బాట పట్టింది. అనేక చిన్న కంపెనీలు తమ యూనిట్లను మూసివేసేందుకు సిద్ధం అవుతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఫార్మా రంగం అగమ్యగోచరంగా తయారైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ముచ్చర్లలో దాదాపు 14వేల ఎకరాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీల విస్తరణ ప్రణాళికలు వాయిదా పడ్డాయి.
కొన్ని కంపెనీలు ఏపీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలకు తరలివెళ్లాయి. దీంతో ఫార్మా క్లస్టర్లు, ఫార్మా విలేజీలను తెరమీదికి తెచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో భూసేకరణకు ప్రయత్నిస్తే జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో ఫార్మా కంపెనీలు తెలంగాణ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది.
బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్
బీఆర్ఎస్ హయాంలో దేశ, విదేశాల్లో తెలంగాణకు కల్పించిన ప్రచారంతో బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. కానీ ఏడాదిగా జరుగుతున్న పరిణామాలు ఈ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి.
ఫార్మాసిటీ రద్దుతో మొదలవగా.. ఫార్మా క్లస్టర్ల పేరుతో లగచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలతో వ్యాపారవేత్తలు ఆలోచనలో పడ్డారు.
సీఎం అమెరికా పర్యటన సందర్భంగా సొంత తమ్ముడికి చెందిన స్వచ్ఛ్ బయోగ్రీన్‌తో ఒప్పందం మరింత పరువు తీసింది.
40,232 కోట్ల ఒప్పందాలు
ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య వేదిక వార్షిక సదస్సు సందర్భంగా రూ. రూ.40,232 కోట్లు పెట్టుబడి ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకున్నది.
1 ఒక్క కంపెనీ తెలంగాణకు రాలేదు
ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా రూ.36వేల కోట్లకు ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు చెప్పుకున్నారు. కానీ ఈ రూ.76వేల కోట్లలో ఒక్క కంపెనీ కూడా కాగితాలను దాటలేదు.
10%హైదరాబాద్‌లో కంపెనీలనమోదు డౌన్
2023 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చుకుంటే 2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్‌లో కంపెనీల నమోదు 10 శాతం తగ్గినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. కంపెనీల నమోదు ఐదేండ్ల కనిష్టస్థాయికి పడిపోయినట్లు స్పష్టం చేసింది.
వెనక్కిపోయిన పరిశ్రమలు
వచ్చిన పెట్టుబడులు
పదేండ్లలో పారిశ్రామికవృద్ధి..