Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా రాజధాని నగరంలో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ 500గా నమోదైంది. తీవ్ర వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కఠిన చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (Pollution Under Control Certificates) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపొద్దని (No fuel) ఆదేశించింది. బీఎస్-6 కంటే తక్కువ ప్రమాణాలు ఉండే ఢిల్లీయేతర ప్రైవేట్ వాహనాలను రాజధానిలోకి అనుమతించబోమని ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 18 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. శీతాకాలంలో కాలుష్య స్థాయిలు దశాబ్దకాలంలో చాలావరకూ ఒకే విధంగా ఉన్నాయని తెలిపారు.
Also Read..
PM Modi | స్వయంగా కారునడుపుతూ.. ప్రధాని మోదీని మ్యూజియానికి తీసుకెళ్లిన జోర్డాన్ యువరాజు.. VIDEO
Delhi Airport | అనుకూలించని వాతావరణం.. విమానాల రాకపోకలపై ప్రభావం..!
Dense Fog | మంటల్లో కాలి బూడిదైన బస్సులు.. 13 మంది మృతి