Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. వాయు కాలుష్యానికి తోడు దట్టంగా పొగమంచు కమ్మేసింది. దాంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ఇండిగో, ఎయర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రయాణీలకు అడ్వైజరీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే, పలు విమానాల రాకపోకలపై ప్రభావితం ఉండవచ్చని పేర్కొంది. ప్రయాణీకులకు సహాయం అందించేందుకు తమ సిబ్బంది అన్ని టెర్మినల్స్‌లో అందుబాటులో ఉన్నారని పేర్కొంది.
ఆయా విమానాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఎయిర్‌లైన్‌తో టచ్‌లో ఉండాలని సూచించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో సోమవారం సైతం పెద్ద ఎత్తున పొగ మంచు కమ్మేయడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో భారీ ట్రాఫిక్ రద్దీతో పాటు పార్కింగ్‌కు కొరత ఏర్పడింది. దురదృష్టవశాత్తు అనేక ఎయిర్ ఇండియా విమానాలు ఆలస్యం, రద్దయ్యాయి. అనివార్య పరిస్థితులు ఎయిర్‌లైన్ నియంత్రణకు లేనప్పటికీ.. ప్రభావితమైన ప్రయాణీకులు రద్దయిన విమానాలకు రీఫండ్, రీషెడ్యూల్ కోసం తమ బృందాలు 24గంటలు అందుబాటులో ఉంటాయని ఎయిర్ ఇండియా తెలిపింది.