PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మూడు దేశాల పర్యటన సోమవారం మొదలైన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా జోర్డాన్ (Jordan)ను సందర్శించారు. సోమవారం సాయంత్రం అమ్మాన్ (Ammaan)కు చేరుకున్నారు. అమ్మాన్ విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని (Jordan PM) జాఫర్ హసన్ (Jafar Hassan) స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ జోర్డాన్ మ్యూజియాన్ని (Jordan Museum) సందర్శించారు.
ఆ దేశ యువరాజు (Jordan Crown Prince) అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా-2 స్వయంగా కారు నడుపుతూ మోదీని మ్యూజియానికి తీసుకెళ్లడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మ్యూజియం అమ్మాన్‌లోని రాస్ అల్ ఐన్ జిల్లాలో ఉంది. ఇది ఆ దేశంలోనే అతిపెద్ద మ్యూజియం. ఈ మ్యూజియంలో అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రక కళాఖండాలను ప్రదర్శిస్తారు. ఇందులో 1.5 మిలియన్ సంవత్సరాల నాటి జంతువుల ఎముకలు, 9 వేల సంవత్సరాల నాటి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విగ్రహాలు ఉంటాయి. జోర్డాన్ పర్యటనకు వెళ్లే టూరిస్ట్‌లు ఈ మ్యూజియాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు.
#WATCH | Crown Prince Al Hussein Bin Abdullah II drives PM Modi to the Jordan Museum as a special gesture. The Crown Prince is the 42nd generation direct descendant of Prophet Mohammad. pic.twitter.com/Dgv01gR0kF
— ANI (@ANI) December 16, 2025
Also Read..
Donald Trump | బీబీసీకి ట్రంప్ షాక్.. 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా
Escalator | వేగంగా మూవ్ అయిన ఎస్కలేటర్.. భయాందోళనకు గురైన విద్యార్థులు.. షాకింగ్ వీడియో