Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ (BBC) మధ్య వివాదం కొనసాగుతోంది. 2021 జనవరి 6వ తేదీన ఆయన చేసిన ప్రసంగాన్ని బీబీసీ ఛానల్ తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసి ప్రసారం చేయడం వల్లే క్యాపిటల్ హిల్‌లో అల్లర్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీకి ట్రంప్ తాజాగా గట్టి షాకిచ్చారు. సంస్థపై పరువు నష్టం దావా వేశారు. 10 బిలియన్ డాలర్లు నష్టపరిహారం డిమాండ్ చేశారు. మియామిలోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ దావా (defamation suit) వేశారు.
వివరాల్లోకి వెళితే, 2020లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2021 జనవరి 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై ఆయన మద్దతుదారులు దాడి చేశారు. ఆ సందర్భంగా ట్రంప్ దాదాపు గంటసేపు ప్రసంగించారు. దీనిపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో తన ప్రసంగాన్ని వక్రీకరించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇక ఈ వివాదం నేపథ్యంలో ట్రంప్‌కు బీబీసీ క్షమాపణలు కూడా చెప్పింది. బీబీసీ చైర్మెన్ సమిర్ షా .. వైట్‌హౌజ్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసిన అంశంలో తనతో పాటు సంస్థ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రసారం చేసిన ఆ వివాదాస్పద డాక్యుమెంటరీని మళ్లీ ప్రసారం చేసే ప్రణాళిక లేదని బీబీసీ వెల్లడించింది. తాము ఎడిట్ చేసిన ట్రంప్ ప్రసంగం తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్నట్లు అంగీకరిస్తున్నామని బీబీసీ చెప్పింది.
Also Read..
Elon Musk | మస్క్ సరికొత్త రికార్డు.. 600 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఘనత..!
Statue of Liberty | బలమైన గాలులు.. నేలకూలిన స్టాట్యూ అఫ్ లిబర్టీ.. VIDEO