AnnaGaru Vostaru | కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ (Karthi) నటిస్తోన్న చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో అన్నగారు వస్తారు టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా.. ఊహించని విధంగా వాయిదా పడ్డదని తెలిసిందే. అనుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్‌కు షాక్ ఇచ్చింది.
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియో పోస్ట్ థ్రియాట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని తెలిసిందే. తాజా కథనాల ప్రకారం వా వాథియార్ ఈ నెల దాటి విడుదలైతే అమెజాన్ ఓటీటీ డీల్ నుంచి వెనక్కి తగ్గే అవకాశాలున్నాయన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాను 2025 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది.
ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అన్నగారు వొస్తారు అనుకున్న సమయానికి విడుదల కాలేదు. సినిమా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు కోర్టు సినిమా రిలీజ్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నగారు వొస్తారు చిత్రంలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, జీఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
45 Official Trailer | శివన్న – ఉపేంద్రల మెగా మల్టీస్టారర్.. ’45’ ట్రైలర్ విడుదల