Nizmabad CP : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్(Riyaz) ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. అయితే.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం రియాజ్‌ను చేర్పించిన పోలీసులు.. ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందో.. సీపీ సాయి చైతన్య (Sai Chaitanya) వెల్లడించారు.
‘సోమవారం ఉదయం రియాజ్ ఆస్పత్రిలో గోలగోల చేశాడు. దాంతో, ఆర్ఐ, సీఐ లోపలికి వెళ్లి రియాజ్‌ను బెడ్ మీద కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే అతడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించి ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొన్నాడు. అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తూ ట్రిగ్గర్ నొక్కాడని.. ఆ సమయంలో గత్యంతరం లేనందున అతడిని కాల్చాల్సి వచ్చింది. రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడిన అసిఫ్కు మల్లారెడ్డి ఆస్పత్రిలో ఉదయం ఆపరేషన్ జరిగింది’ అనినిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడించారు.
నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను నిందితుడు షేక్ రియాజ్ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. వాహనాల దొంగతనం కేసులో రియాజ్‌ను అదుపులోకి తీసుకుని బైక్‌పై తీసుకెళ్తుండగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన ప్రమోద్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. షేక్ రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#Nizamabad Constable Murder Case: Accused #SheikhRiyaz Killed in Police #Encounter
A dramatic turn in the sensational Nizamabad constable murder case — the accused, Sheikh Riyaz, has been killed in a police encounter.
According to reports, Riyaz, who was undergoing treatment at… pic.twitter.com/1I2XYr2y98
— Hyderabad Daily News (@HDNhyderabad) October 20, 2025
ఈ క్రమంలో సారంగపూర్‌లోని అటవీ ప్రాంతంలో పడివున్న ఓ పాడుబడిన లారీలో దాక్కుని ఉండగా పోలీసులు అక్కడకు వెళ్లారు. అతడిని పట్టుకునే క్రమంలో స్థానికుడు సయ్యద్ అసిఫ్‌ను కత్తితో గాయపరిచాడు రియాజ్.ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో రియాజ్కుకూడా గాయాలయ్యాయి. దాంతో.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కూడా పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూసిన అతడు ఎన్కౌంటర్లో హతమయ్యాడు.