SLW vs BANW : శ్రీలంక నిర్దేశించిన స్వల్ప ఛేదనలో బంగ్లాదేశ్ పోరాడుతోంది. 2 4 పరుగులకే ఓపెనర్లు ఔట్ కావడంతో జట్టును గెలిపించే బాధ్యత మిడిలార్డర్‌పై పడింది. ఫామ్‌లో ఉన్నశోభన మిస్త్రీ(8)ని సుంగంధిక కుమారి వెనక్కి పంపి బంగ్లాకు షాకిచ్చింది. యాభై రన్స్ లోపే మూడు కీలక వికెట్లు పడినందున షర్మీన్ అక్తర్ (44 నాటౌట్), కెప్టెన్ నిగర్ సుల్తానా(16 నాటౌట్)లు ఆచితూచి ఆడుతున్నారు.
ముంబైలోని డీవై పాటిల్ మైదానంలో శ్రీలంకను 202కే కట్టడి చేసిన బంగ్లాదేశ్ ఎప్పటిలానే ఛేదనలో అపసోపాలు పడుతోంది. శుభారంభమివ్వాల్సిన ఓపెనర్లు ఫర్గయా ఖాన్(7), రుబియా హైదర్ (0)లు నిరాశపరిచారు. ప్రబోధిని ఓవర్లో సున్నాకే రుబియా వెనుదిరగగా.. ఫర్గాన అనూహ్యంగా రనౌటయ్యింది.
𝐒𝐨𝐛𝐡𝐚𝐧𝐚 𝐌𝐨𝐬𝐭𝐚𝐫𝐲 𝐠𝐨𝐧𝐞 𝐞𝐚𝐫𝐥𝐲! 👀
Sugandika Kumari claims her first, Sri Lanka’s 3rd — Bangladesh 44/3 (15.3)! 🏏#CricketTwitter #CWC25 #SLvBAN pic.twitter.com/XOFiy0OQIL
— Female Cricket (@imfemalecricket) October 20, 2025
ఆ తర్వాత వచ్చిన శోభన మోస్త్రే (8)ను సుగంధిక బోల్తా కొట్టించింది. చూస్తుండగానే మూడు వికెట్లు పడగా.. షర్మీన్ అక్తర్ (44 నాటౌట్), నిగర్ సుల్తానా(16 నాటౌట్) క్రీజులో పాతుకుపోయి స్కోర్ బోర్డును నడిపించారు. అయితే.. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ కారణంగా బౌండరీలు రావడం లేదు. వికెట్ కాపాడుకుంటున్న ఈ ఇద్దరూ జట్టుకు రెండో విజయం అందించేందుకు చెమటోడ్చుతున్నారు. 26 ఓవర్లకు స్కోర్… 82/3. ఇంకా బంగ్లా విజయానికి 121 పరుగులు కావాలి.