Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్ 20: నిజామాబాద్లో రౌడీషీటర్ షేక్ రియాజ్ మృతి పట్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో జనాలు, యువత, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
మూడు రోజుల క్రితం నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను పాత నేరస్తుడు రియాజ్ అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు. రెండు రోజుల తర్వాత ఆదివారం నాడు సారంగపూర్ వద్ద నిందితుడిని పట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పోలీసు కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపి రియాజ్ను హతమార్చారు. ఈ విషయం తెలియడంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Nizamabad2
ఎన్సీపీ నాయకులు విఠల్ నాయక్తో పాటు ఇతర రాజకీయ పార్టీలు, యువకులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పోలీసుల పనితీరు పై హర్షం వ్యక్తం చేశారు. దీంతోపాటు నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సైతం పోలీసులు టపాకాయలు కాల్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యువత టపాకాయలు కాల్చి తమ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో హాట్సాఫ్ పోలీస్ అంటూ పోస్టులు చేశారు.