మాక్లూర్, నవంబర్ 10 : ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల తండ్రి కృష్ణమూర్తి ప్రథమ వర్ధంతిని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, టీయూ వీసీ రవీందర్‌గుప్తా తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్మృతివనం ఏర్పాటు చేసే వ్యవసాయ క్షేత్రంలో పనులకు స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రైతు బిడ్డ బిగాల కృష్ణమూర్తి ఏడు పదుల వయస్సులోనూ వ్యవసాయ పనులను చూసుకునేవారన్నారు. మంత్రి వేముల మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలను, జ్ఞాపకాలను మాక్లూర్ ప్రజలు మరిచిపోకుండా వారి పేరు మీద సామాజిక సేవా కార్యక్రమాలు, స్మృతివనం ఏర్పాటు చేయడం ఘన నివాళి అర్పించడమే అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణమూర్తి జ్ఞాపకార్థం మాక్లూర్‌లో ప్రభుత్వ పాఠశాలను అన్ని హంగులతో కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో త్వరలోనే నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం రూ. 4.5 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. కోటి రూపాయలను సహచర ఎమ్మెల్యే గణేశ్ సోదరులు అందజేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కోడ్ కారణంగా శంఖుస్థాపన కార్యక్రమం అగిపోయిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.