Nita Ambani | రిలయన్స్‌కు ఫౌండేషన్
Nita Ambani | నీతా అంబానీ.. ఈ మధ్యే రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకొన్నారు. అలా అని ఆమె బాధ్యత తీరిపోలేదు. మరింత పెరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రిగా పూర్తి చేయాల్సిన పనులు, సాధించాల్సిన విజయాలు, చేరాల్సిన గమ్యాలు చాలానే ఉన్నాయి.
నీతా అంబానీ.. ఈ మధ్యే రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకొన్నారు. అలా అని ఆమె బాధ్యత తీరిపోలేదు. మరింత పెరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రిగా పూర్తి చేయాల్సిన పనులు, సాధించాల్సిన విజయాలు, చేరాల్సిన గమ్యాలు చాలానే ఉన్నాయి. ‘దేశవ్యాప్తంగా యాభైనాలుగు వేల గ్రామాల రూపురేఖలను మార్చడం నా తక్షణ కర్తవ్యం’ అంటారామె. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో తన భవిష్యత్ ప్రణాళికను ఇలా వివరించారు.. ‘సంస్కృతి నుంచి వాతావరణం వరకు, చదువుల నుంచి క్రీడల వరకు.. అన్నిటికీ మించి మహిళా సాధికారతకు నేను చేయాల్సింది చాలా ఉంది.
గ్రామీణ కళాకారుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దడానికి మేం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఏ ఒక్క ప్రాచీన కళా.. ఆదరణ లేని కారణంగా అంతరించిపోకూడదు. ఏ సంప్రదాయ కళాకారుడూ ప్రోత్సాహం కరువై పస్తులు ఉండకూడదు. భారతీయ ఆత్మను రేపటి తరాల గుండెల్లో నింపేందుకు విద్యా రంగంపైనా దృష్టిపెడుతున్నాం. బడి బావుండాలంటే గురువులు సమర్థులు కావాలి. అందుకే, ప్రపంచశ్రేణి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించే ఆలోచన ఉంది’. కలల్ని నిజం చేసుకోవాలంటే.. లక్ష్యశుద్ధి ఉండాలి, ‘విత్త’శుద్ధీ ఉండాలి. అంబానీల కోడలికి ఈ రెండూ పుష్కలమే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

