సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి నగర జనానికి వణుకు పుట్టిస్తోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రంగారెడ్డి జిల్లాలో 10.1డిగ్రీల సెల్సియస్, మేడ్చల్ మల్కాజిగిరిలో 11.6 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్ 13.1 డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగాన మోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఇక గ్రేటర్ వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 54 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాగల మరో మూడు నాలుగు రోజుల వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.