NHRC | హుస్నాబాద్‌టౌన్, జూలై 16: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) పని చేస్తుందని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పెందోట భూశంకరాచారి అన్నారు. హుస్నాబాద్‌లో బుధవారం సంస్థకు చెందిన సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భూశంకరాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల విషయంపై స్పందించని పక్షంలో తమ సంస్థ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి రాజ్యాంగానికి లోబడి న్యాయం చేసేందుకు సంస్థ పని చేస్తుందని జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా కొత్త సభ్యులకు ఐడీ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ నియోజకవర్గ ఇంచార్జీ ఎదులాపురం నవీన్, నాయకులు వేముల వెంకటరమణ, సంగ అంజనేయులు, అషాడం శ్రీనివాస్, కొడూరి శ్రీదేవితోపాటు పలువురు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కన్వీనర్‌గా పంజా సంపత్, ఉపాధ్యక్షుడిగా బొమ్మగాని హరిబాబు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా తగరపు లక్ష్మణ్, హుస్నాబాద్ మండల అర్గనైజింగ్ కార్యదర్శిగా గడిపె సంపత్, అక్కన్నపేట మండల కన్వీనర్‌గా చొప్పరి సంపత్, చిగురుమామిడి మండల అధ్యక్షుడిగా అమోజు అంజనేయులను నియమించారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్‌ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం