నేపియర్: వన్డే సిరీస్‌నూ న్యూజిలాండ్..మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. వర్షం వల్ల 34 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్.. కెప్టెన్ షై హోప్ (69 బంతుల్లో 109, 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులతో 247/9 రన్స్ చేసింది. ఛేదనలో కివీస్.. 33.3 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి గెలిచింది. కాన్వే (90), రచిన్ (56), లాథమ్ (39*) ధాటిగా ఆడారు.