జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూతురు తిరుమల శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సింగాపురం గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, వావిలాల గ్రామానికి చెందిన కొండా అర్జున్, కొండా రవి ఆధ్వర్యంలో 40 మంది గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతమంది బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరగా, వారిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. గడపగడపకూ తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి వివరించాలని వారికి సూచించారు.