కొన్ని వస్తువులను చూడగానే కొనాలనిపిస్తుంది. అందులోనూ ఈమధ్యే మార్కెట్లో విడుదలైన పింగాణి కాఫీ టేబుల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిని ప్రముఖ స్పానిష్ డిజైనర్ జేమ్ హేయాన్ రూపొందించారు. ఇంటర్నేషనల్ ఫర్నిచర్ సంస్థ సోర్సస్ విక్రయిస్తున్నది. ఈ టేబుల్ తేలికగా ఉంటుంది. ఎక్కడికైనా మోసుకెళ్లిపోవచ్చు. పిక్నిక్లకు కారులో వేసుకుని తీసుకెళ్లొచ్చు. కాకపోతే విరిగిపోకుండా జాగ్రత్తపడాలి. ఈ డిజైన్లతో ఇంటికి కూడా అందం వస్తుంది. ఒకేచోట నాలుగైదు పెడితే, పుట్టగొడుగుల్లా గమ్మత్తుగా కనిపిస్తాయి. దేశాన్ని బట్టి ధరలు మారిపోతూ ఉంటాయి. వివరాలకు సంస్థ వెబ్సైట్ చూడవచ్చు.