ఖాట్మండు : రోడ్లపై నిత్యం ట్రాఫిక్ జామ్ అవడం, రోడ్లకు ఇరువైపులా చెత్త వేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఒక సమస్యే హిమాలయ పర్వతాలకు వచ్చింది. అదేంటంటే చెత్త. గత కొన్ని సంవత్సరాలుగా హిమాలయ పర్వత శ్రేణిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏటా పర్వతారోహకుల సంఖ్య కూడా పెరుగుతుండటం కూడా ఈ సమస్య జఠిలమయ్యేందుకు కారణమని నేపాల్‌కు చెందిన పర్వతారోహకులు అంటున్నారు.
హిమాలయాలను అధిరోహించేందుకు వచ్చే పర్వతారోహకులు తమతో తెచ్చుకుంటున్న ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు, క్యాన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, బ్యాటరీలు, ఆహారపదార్థాల ర్యాపర్లు, ఇతర సామగ్రిని తమ పర్యటన ముగియగానే ఇక్కడ పడేసి వెళ్లిపోతుండటంతో హిమాలయాలు చెత్త కుప్పలా మారిపోతున్నాయని వారు వాపోతున్నారు.
హిమాలయాలను శుభ్రం చేసే పనికి నేపాల్‌కు చెందిన కొందరు పర్వతారోహకులు నడుం బిగించారు. వాతావరణ అనుకూలించనప్పటికీ హిమాలయాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు వారు సిద్ధమయ్యారు. 2019 లో ప్రభుత్వం ఆధ్వర్యంలో హిమాలయాలను శుభ్రం చేసిన పర్వతారోహకులు మొత్తం 11 వేల కిలోల చెత్తతోపాటు నాలుగు మృతదేహాలను తరలించారు. ఈ పరిశుభ్రత డ్రైవ్‌ను అప్పుడు దాదాపు రెండు నెలలపాటు కొనసాగించారు.
మరోసారి హిమాలయాలను శుభ్రం చేసిన స్థానిక పర్వతారోహకులు అక్కడి నుంచి దాదాపు 2 టన్నుల చెత్తను సేకరించారు. గతంలో కంటే ఎక్కువ మంది పర్వతారోహకులు హిమాలయాలను అధిరోహించేందుకు వస్తున్నందునే చెత్త ఎక్కువగా పోగవుతున్నదని వారు చెప్తున్నారు. స్థానిక షెర్పాస్తో భాగస్వామ్యంతో 2019 మే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2020 ప్రారంభంలో మరోసారి క్లీనింగ్ డ్రైవ్ చేపట్టాల్సి ఉన్నప్పటికీ, కొవిడ్ మహమ్మారి కారణంగా దీనిని 2020 సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పటివరకు నేపాల్‌లోని ఎనిమిది ఎత్తైన పర్వతాలను శుభ్రం చేయగలిగారు.
శుభ్రపరిచే యాత్రకు పర్వతారోహకుడు దావా స్టీవెన్ షెర్పా నాయకత్వం వహించాడు. అతను తన బృందంతో కలిసి చో ఓయూ, ఎవరెస్ట్, లోట్సే, మకాలూ పర్వతాల నుంచి సుమారు 2.2 టన్నుల చెత్తను తొలగించారు. ఏదేమైనా, వారు రెండు పర్వతాలను అధిరోహించి నాలుగు ఆల్పైన్ హిమానీనద పాస్‌లను దాటవలసి ఉన్నందున ఈ పని సవాలుగా ఉన్నది.
కొవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఫ్రాన్స్‌లో లాక్డౌన్
ప్రజాప్రతినిధుల పని తీరే ఓటేసేందుకు కొలమానం కావాలి: వెంకయ్యనాయుడు
మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి
ఆల్ ఫూల్స్ డే.. ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..