Satavahana University | కమాన్రస్తా, నవంబర్ 28 : శాతవాహన విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 4, 5 ఫిబ్రవరి 2026లో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు కరపత్రాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యూ ఉమేష్ కుమార్, రిజిస్టార్ ఆచార్య రవికుమార్ జాస్తి, ఓఎస్డీ టూ వీసీ డాక్టర్ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ సంయుక్తంగా విడుదల చేశారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ అంశాలపై కృత్తిమ మేధస్సు యొక్క ప్రభావం, భారత ఆర్థిక వ్యవస్థ పై కృత్రిమ మేధస్సు ప్రభావం దాని పర్యవసానాలు మొదలకు అంశాలపై వ్యాసాలను జాతీయస్థాయిలోని మేధావులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు డిసెంబర్ 30 లోపు పంపించాలని సదస్సు కన్వీనర్ అర్థశాస్త్ర విభాగ అధిపతి అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కోడూరి శ్రీవాణి చెప్పారు. వచ్చిన వ్యాసాలన్నింటినీ క్రోడీకరించి ఉత్తమమైన వ్యాసాలను జర్నల్స్‌లో ప్రచురించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఎం వరప్రసాద్, విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, డాక్టర్ కే పద్మావతి, డాక్టర్ ఉమేరా, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.