నార్నూర్ : జూబ్లీహిల్స్( Jubilee) ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోపినాథ్ సతీమణి సునీత ( Maganti Sunita) ను గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, నార్నూర్ సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు ఉద్ధవ్ కాంబ్లే, మాజీ ఉపసర్పంచ్ విష్ణుఫడ్ శనివారం జూబ్లీహిల్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృత ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ హయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, నేడు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు.