కరీంనగర్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ఉమెన్స్ డేను పురస్కరించుకొని మహిళా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించిన టీఆర్ఎస్, ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. మంత్రి కేటీఆర్ పిలుపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శ్రేణులు రెడీ అయ్యాయి. ఆదివారం తొలిరోజు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీ కట్టనున్నారు. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ వరర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకులను గౌరవపూర్వకంగా సన్మానిస్తారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేసీఆర్ మహిళా బంధు వేడుకల్లో భాగంగా కరీంనగర్ మున్సిపల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, కార్మికులు, కార్పొరేటర్లకు అంబేద్కర్ స్టేడియంలో శనివారం వాకింగ్, త్రోయింగ్, మ్యూజికల్ ఛైర్, లెమన్ స్పూన్ క్రీడా పోటీలను నిర్వహించారు. అంతకుముందు పోటీలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
గంభీరావుపేట, మార్చి 5: మహిళలను గౌరవిద్దామని, ఉమెన్స్ డే సందర్భంగా ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలను ఘనంగా నిర్వహిద్దామని నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ సరికొత్త పథకాలను అమలు చేశారని, వీటన్నింటినీ వివరిస్తూ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
మానకొండూర్, మార్చి 5: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. 8న మానకొండూర్లోని సుప్రిం ఫంక్షన్ హాల్లో నియోజకవర్గస్థాయి సంబురాలకు సంబంధించిన ఏర్పాట్లను సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి శనివారం పరిశీలించారు.
ఈమె సేవలకు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందాయి. 2008, 1999లో జిల్లా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు అందుకున్నారు. 2009 ఎన్సీఎస్సీ నుంచి జాతీయస్థాయి అవార్డు, 2013లో పర్యావరణ మిత్ర అవార్డు, 2014లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉత్తమ సామాజిక వేత్త, 2015లో బెస్ట్ టీచర్ అవార్డు, 2017లో హరితసేవ పురస్కారం, 2018లో హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ భారత మహిళా శిరోమణి అవార్డు, 2021లో అక్టోబర్ 31న భారత జాతీయకీర్తి పతాక పురస్కారం అందుకున్నారు. కాగా, తాను అవార్డుల కోసమో, రివార్డుల కోసమే సామాజిక సేవ చేయడం లేదని, సమాజం బాగుంటేనే మనం బాగుంటామనే ఆలోచనలతో పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజలను, విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నట్లు టీచర్ సానే అనురాధ తెలిపారు.