కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్న పాట ఏదైనా ఉందా..? అంటే ఠక్కున చెప్పే సాంగ్ ఛమ్కీలా అంగీలేసి (Chamkeela Angeelesi). నాని (Nani) నటించిన దసరా (Dasara) సినిమాలోని ఈ పాటను మ్యూజిక్ లవర్స్, మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడిదే పాటను నాని సతీమణి అంజనా యెలవర్తి (Anjana Yelavarthy) కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. నటి నజ్రియాతో కలిసి ఇదే పాటకు హమ్ చేసింది అంజనా . క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో హీరోయిన్ను పర్ఫెక్ట్గా దింపేసింది అంజనా. ఈ వీడియోను అంజనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఛమ్కీలా అంగీలేసి ఓ వదినే పాట నెట్టింట వ్యూస్ పంట పండిస్తోంది. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. సంతోష్ నారాయణన్ కంపోజిషన్‌లో రామ్ మిర్యాల, DHEE పాడారు. ఈ పాటకు పాపులర్ కొరియోగ్రఫర్ రక్షిత్ శెట్టి నృత్యరీతులు సమకూర్చాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా టైంలో పల్లెటూరి యాసలో నాని గురించి కీర్తిసురేశ్ పాడుకునే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
నజ్రియా, అంజనా డ్యాన్స్..
Naresh 61 | జాతిరత్నాలు బ్యూటీతో అల్లరి నరేశ్ కొత్త సినిమా.. వివరాలివే
NBK 108 | స్టైలిష్ మాస్ అవతార్‌లో బాలకృష్ణ.. ఎన్బీకే 108 ఫస్ట్ లుక్స్ వైరల్
Miss Shetty Mr Polishetty | Miss శెట్టి మిస్టర్ Polishetty నుంచి నోనోనో లిరికల్ సాంగ్