ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. పైలట్ సహా ఆరుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ నుండి శుక్రవారం మధ్యాహ్నం ఐదుగురు ప్రయాణికులతో బయలుదేరిన హెలికాప్టర్ చమోలీ జిల్లాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
- మృతుల్లో బెంగళూరు పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్
చమోలీ : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ నుండి శుక్రవారం మధ్యాహ్నం ఐదుగురు ప్రయాణికులతో బయలుదేరిన హెలికాప్టర్ చమోలీ జిల్లాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ అదృశ్యమైన గంట తర్వాత ప్రమాద సమాచారం అందడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం ప్రమాద స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు ఆరుగురి మృతదేహాలను వెలికితీశాయి.
హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆ ఐదుగురు కర్ణాటకకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. వీరిలో అరుణ్ సాలుంకే, హెచ్ఎస్ నటరాజ్, ప్రతాప్ నింగరాజన్, సుధీర్ కే, శంకరగౌడ్ వీబీ ఉన్నారు. అరుణ్ సాలుంకే బెంగళూరు పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. హెలికాప్టర్‌ను నడిపిన పైలట్ హిమాన్షు సబర్వాల్ ఢిల్లీకి చెందినవారు. ఈ హెలికాప్టర్‌ను ప్రైవేట్ సంస్థ ట్రాన్స్ భారత్ ఏవియేషన్ నిర్వహిస్తున్నది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

