దూసుకొస్తున్న ‘అక్వాన్’
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉద యం వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇది క్రమంగా తీవ్రవాయుగుండంగా మారి సోమవారం నాటికి తు పాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది.
- నేడు తుపాన్‌గా మారనున్న వాయుగుండం
- 20న తీరం దాటే అవకాశం
- మహబూబాద్ భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉద యం వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇది క్రమంగా తీవ్రవాయుగుండంగా మారి సోమవారం నాటికి తు పాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. ఈ తుపానుకు ‘అక్వాన్’ అని నామకరణం చేశా రు. ఈ తుపాన్ కారణంగా ఏపీతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్త రు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. సోమవారం తుపానుగా బలపడే అవకా శం ఉన్నది.
మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈనెల 20న అక్వాన్ తుపాన్ ఉత్తరకోసాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు.ఈ తుపాన్ ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 20 నుంచి 22 వరకు తెలంగాణలోని తూర్పు, దక్షిణ ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

