ఈ పెట్టుబడులు ట్రై చేస్తారా?
నెలనెలా ఆదాయం అనేది మనం తోసిపుచ్చలేని అత్యంత అవసరం. ఉద్యోగ జీవితంలోగానీ, అనంతర కాలంలోగానీ మంత్లీ ఇన్కమ్ ఇచ్చే ధీమానే వేరు. అందుకే ప్రస్తుతం వీటికి విపరీతమైన ఆదరణ కనిపిస్తున్నది. మరి అందుబాటులో ఉన్న టాప్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు ఏంటో చూద్దామా..
- మంత్లీ ఇన్కమ్ కోసం టాప్ ప్లాన్లు ఇవే
నెలనెలా ఆదాయం అనేది మనం తోసిపుచ్చలేని అత్యంత అవసరం. ఉద్యోగ జీవితంలోగానీ, అనంతర కాలంలోగానీ మంత్లీ ఇన్కమ్ ఇచ్చే ధీమానే వేరు. అందుకే ప్రస్తుతం వీటికి విపరీతమైన ఆదరణ కనిపిస్తున్నది. మరి అందుబాటులో ఉన్న టాప్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు ఏంటో చూద్దామా..
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 60 ఏండ్లు దాటినవారికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అనేది చక్కని నెలవారీ ఆదాయ మార్గం. ప్రభుత్వ భరోసా ఉంటుంది కాబట్టి ఇదో సురక్షిత పెట్టుబడి వేదిక. అయితే రిటైరైన నెలలోపే ఈ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకుల శాఖలు, పోస్టాఫీసులలో లభిస్తుంది. ప్రస్తుత వార్షిక వడ్డీరేటు 8.2 శాతంగా ఉన్నది. రూ.15 లక్షలదాకా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. గరిష్ఠంగా 8 ఏండ్ల కాలవ్యవధి ఉంటుంది.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: రిస్క్‌లకు దూరంగా ఉండాలనుకునేవారికి ఇదో సురక్షిత పెట్టుబడి పథకం. ప్రభుత్వ భరోసా ఉంటుంది. వార్షిక వడ్డీరేటు 7.4 శాతంగా ఉన్నది. డిపాజిట్ కాలపరిమితి గరిష్ఠంగా 10 ఏండ్లు. వ్యక్తిగతంగా రూ.4.5 లక్షలు, సంయుక్తంగా రూ.9 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. కనీసం రూ.1,500తో కూడా ఈ స్కీమ్‌ను మొదలు పెట్టవచ్చు.
దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లు: తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడుల కోసం వెతికేవారికి ఈ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లు చక్కగా సరిపోతాయి. ఈ బాండ్ల మెచ్యూరిటీ కాలం 5-40 ఏండ్లు.
డిపాజిట్లు: బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద డిపాజిట్లుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే కార్పొరేట్ డిపాజిట్లు.. బ్యాంక్ డిపాజిట్లతో పోల్చితే అంతగా సురక్షితం కావు. కానీ అధిక వడ్డీరేట్లు, ఇతర ప్రయోజనాలుంటాయి. కాబట్టి పెట్టుబడికి ముందే ఆయా కంపెనీల ఆర్థిక పరిపుష్ఠి గురించి పూర్తిగా తెలుసుకుని ఓ నిర్ణయానికి రావడం ప్రధానం.
మ్యూచువల్ ఫండ్స్: ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీలలో చిన్నమొత్తాల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రయత్నించవచ్చు. సిప్‌లతో మొదలు పెట్టవచ్చు. అయితే ఇవి మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి.
జీవిత బీమా ప్లస్ సేవింగ్స్: గ్యారంటీ ఆదాయంతో కూడిన బీమా పాలసీ మరో పెట్టుబడి మార్గం. రకరకాల బీమా సంస్థలు స్థిరమైన మంత్లీ ఇన్కమ్ అవకాశాలను కల్పిస్తున్నాయి. అలాగే యాన్యుటీ ప్లాన్లనూ ట్రై చేయవచ్చు. తక్కువ రిస్క్ ఉంటుంది. పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టి రిటైర్మెంట్ ప్లాన్‌నూ రూపొందించుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

