మున్సి‘పోల్’కు కాంగ్రెస్ వణుకు!
రాష్ట్రంలో హైదరాబాద్ సహా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతున్నదా? ఓటమి భయమే అధికార పార్టీ వెన్నులో వణుకుపుట్టిస్తున్నదా? హైదరాబాద్ పరిధిలోని 24 స్థానాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కోలేక వాయిదా మంత్రం జపిస్తున్నదా?
- ఓటమి భయమా.. రాజకీయ లెకలా?
- హైదరాబాద్‌తోపాటు 5 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎప్పుడో?
- ప్రత్యేకాధికారుల పాలనలో పట్టణాలు
- ఏపీలో ఇటీవలే స్థానిక ఎన్నికలు పూర్తి
- రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మౌనం
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో హైదరాబాద్ సహా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతున్నదా? ఓటమి భయమే అధికార పార్టీ వెన్నులో వణుకుపుట్టిస్తున్నదా? హైదరాబాద్ పరిధిలోని 24 స్థానాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కోలేక వాయిదా మంత్రం జపిస్తున్నదా? చంద్రబాబు ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేశారు. ఓటమి భయంతో ఇంకా ఎన్నాళ్లు ఎన్నికలను వాయిదా వేద్దాం’ అని మధనపడుతున్నదా? అంటే ప్రస్తుత తాజా పరిణామాలు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. జీహెచ్ఎంసీకి 2020 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. ఐదేండ్ల పదవీకాలం 2026 ఫిబ్రవరి10తో ముగిసింది.
మరుసటి రోజు ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం-2026 ద్వారా పట్టణ పాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. వార్డుల సంఖ్యను 150 నుంచి సుమారు 300కు పెంచే పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. కొత్త వ్యవస్థకు అనుగుణంగా అధికారులు, కమిషనర్లను నియమించింది. ఇక ఎన్నికలు నిర్వహించడమే మిగిలింది. కానీ ఎన్నికల నిర్వహణపై మాత్రం ఇంతవరకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోలేదు.
రాష్ట్రంలో కాలపరిమితి ముగిసిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్లతోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు మణుగూరు, మందమర్రి, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. అయితే, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. ఈ పట్టణాల్లో ప్రజాప్రతినిధులు ఎప్పుడు కొలువుదీరుతారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
ఓటమి భయంతోనే వాయిదా?
జీహెచ్ఎంసీ ఎన్నికలు కాంగ్రెస్‌కు రాజకీయంగా పెను సవాల్‌గా మారుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని 24 స్థానాల్లో బీఆర్ఎస్ 16, ఎంఐఎం ఏడు, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా దకలేదు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలోని మూడు స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. ఈ నేపథ్యంలో పట్టణ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కాంగ్రెస్‌కు కీలకంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఎన్నికలకు ముందు ప్రభుత్వ హామీల అమలు, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు రాజకీయ ప్రముఖులు చెప్తున్నారు. మరోవైపు గతంలో బీఆర్ఎస్, బీజేపీకి బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్న ప్రాంతాలను విడదీసి కొత్త వార్డులు ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ సమీకరణాలు మారుతాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 150 వార్డుల స్థానంలో సుమారు 300 వార్డులతో కొత్త రాజకీయ పోటీకి అవకాశం ఏర్పడింది. అయితే కార్పొరేషన్ల విభజనతోనే ఎన్నికల్లో ప్రయోజనం కలుగుతుందా? అనేది ఎన్నికలతోనే వెల్లడికానున్నది.
హామీలపై నిర్లక్ష్యం.. ప్రజల్లో ఆగ్రహం!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా హైదరాబాద్ పరిధిలో ప్రజలకు మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలుపై ప్రభుత్వం ఎలాంటి దృష్టి కూడా పెట్టకపోవడం స్పష్టంగా కనిపిస్తున్నది. పాలన పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వివాదాలు, హైడ్రా చర్యలపై న్యాయపరమైన అభ్యంతరాలు, స్థానిక సమస్యలు ప్రభుత్వానికి తీవ్ర ప్రతికూలంగా మారాయి. రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, ట్రాఫిక్ సమస్యలు పట్టణ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. పేదల ఇండ్లను కూల్చేసిన హైడ్రా వ్యవస్థపై నగర ప్రజలు భగ్గుమంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల అమలుపైనా అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే ప్రజల నుంచి ప్రతికూల స్పందన వస్తుందనే కారణంతోనే రేవంత్ సర్కార్ వెనుకడుగు వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
‘సర్’ పేరుతో కుంటిసాకులు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించింది. దీనిని అమలుచేయకుండానే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. మిగిలిన ఐదు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నది. 31 జడ్పీలు, 565 మండల పరిషత్‌లు కూడా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికలకు వెళ్లడం లేదని కొందరు కాంగ్రెస్ పెద్దలు కుంటిసాకులు చెప్తున్నారు. అయితే, ఏపీలో ‘సర్’ప్రక్రియ పూర్తికాకుండా ఎన్నికలు నిర్వహించగా ఇక్కడ వచ్చిన అడ్డంకి ఏందంటే వారి వద్ద సమాధానం లేదు. ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన 16వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదు. కొన్ని మున్సిపాలిటీల్లో భారీ ప్రాజెక్టుల అమలుకు అప్పులే దిక్కవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త పాలకవర్గాల ఏర్పాటు అత్యవసరంగా మారింది.
ప్రత్యేకాధికారుల పాలనకు అంతులేదా?
పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు, కమిషనర్ల పర్యవేక్షణలోనే పట్టణ పాలన కొనసాగుతున్నది. వార్డులవారీగా ప్రజల సమస్యలను వినిపించుకునే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లేకపోవడం లోటుగా మారింది. రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ప్రజలు అధికారుల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. స్థానికంగా సమస్యలను గుర్తించి అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో జవాబుదారీతనం కరువైంది. ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం ఎంతకాలం కొనసాగిస్తుంది? ఎన్నికల నిర్వహణకు నిర్దిష్ట గడువు ఎందుకు ప్రకటించడం లేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికలకు పోతుందా? లేక ప్రత్యేకాధికారుల పాలననే కొనసాగిస్తుందా? అనేది తేలాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

