రాజకుమారి శూర్పణఖ
నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ ఫ్రాంచైజీలోని తొలిభాగం నవంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ ఫ్రాంచైజీలోని తొలిభాగం
నవంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న
విషయం తెలిసిందే. సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటిస్తున్న ఈ పౌరాణిక ఇతిహాసం
కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దాదాపుగా నాలుగు వేల కోట్ల నిర్మాణ వ్యయంతో నమిత్ మల్హోత్రా రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ఫ్రాంచైజీలో రావణుడిగా కన్నడ అగ్ర హీరో యశ్ నటిస్తుండగా, మండోదరిగా కాజల్ అగర్వాల్, హనుమంతుడిగా సన్నిడియోల్, శూర్పణఖ పాత్రను రకుల్ ప్రీత్‌సింగ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ న్యూలుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
బంగారు ఆభరణాలు ధరించి, రాజసం ఉట్టిపడే వస్ర్తాధారణతో రథంపై వస్తున్న రావణ సోదరి శూర్పణఖని ఈ పోస్టర్లో చూడొచ్చు. వాల్మీకి రామాయణం శూర్పణఖను సౌందర్యరాశిగా పేర్కొన్నది. దానికి తగ్గట్టే శూర్పణఖగా రకుల్ ఈ పోస్టర్లో చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రముఖ పంపిణీ సంస్థ ఎస్వీసీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సినిమాలోని రెండో పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి రానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

