నమ్మకమే నా గర్వం
తమాషా, లావణీ వంటి మహారాష్ట్ర జానపద కళల ద్వారా ప్రఖ్యాతి పొందిన కళాకారిణి విఠాబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఈథా’.
తమాషా, లావణీ వంటి మహారాష్ట్ర జానపద కళల ద్వారా ప్రఖ్యాతి పొందిన కళాకారిణి విఠాబాయి జీవిత కథ
ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఈథా’. శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్
ఊటేకర్ దర్శకుడు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
విఠాబాయి సాధించిన విజయాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలకు అద్దం
పడుతూ ట్రైలర్ ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగింది. సంప్రదాయ లావణీ వస్త్రధారణలో శ్రద్ధాకపూర్
చేసిన నృత్యాలు హైలైట్‌గా నిలిచాయి. అయితే వేదికపై ప్రశంసలు అందుకునే కళాకారిణి వ్యక్తిగత
జీవితంలో ఎదుర్కొన్న నమ్మకద్రోహం, అవమానాలను ఈ ట్రైలర్లో చూపించారు.
‘నా నమ్మకమే నా గర్వం..అది విరిగిపోయినప్పుడు అంతా కూలిపోయింది’ అంటూ శ్రద్ధాకపూర్ చెప్పిన సంభాషణ ఆమె పాత్ర తాలూకు మనోవేదనను ఆవిష్కరించింది. మహారాష్ట్ర జానపద రంగంలో అగ్రగామి కళాకారిణిగా ఎదిగి ‘తమాషా సామ్రాజ్ఞి’గా పేరు పొందిన విఠాబాయి 2002లో కన్నుమూశారు. ఈ చిత్రంలో రణ్‌దీప్ హూడా, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

