Naresh 61 | జాతిరత్నాలు బ్యూటీతో అల్లరి నరేశ్ కొత్త సినిమా.. వివరాలివే
టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేశ్ (Allari Naresh)నటిస్తోన్న కొత్త సినిమా ఇవాళ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్నిచిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేశ్ (Allari Naresh) ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొత్త సినిమా అప్డేట్ అందించారు. అల్లరి నరేశ్ నటిస్తోన్న కొత్త సినిమా ఇవాళ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్నిచిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానిక డెబ్యూ డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ షురూ కానుంది.
నరేశ్ గతంలో కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేశాడు. అయితే ఈ సారి స్టోరీలో ఉన్న యూనిక్ పాయింట్ ఇంప్రెస్ చేయడంతో నరేశ్ ఈ సినిమాను ఒకే చేశాడని ఇన్సైడ్ టాక్. జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా (Faria Abdullah ) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు అందిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య కెమెరామెన్.. కాగా చోటా కే ప్రసాద్ ఎడిటర్. అల్లరి నరేశ్ 61వ సినిమా (Naresh61)గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
అల్లరి నరేశ్ ప్రస్తుతం నాంది ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీ సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్నా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీకి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తున్నారు.
#Naresh61 officially launched with a Pooja Ceremony✨
📜GeminiKiran,SharatMarrar
🎬 SureshBabu
1st Shot @nagashwin7
📽️@TharunBhasckerD🌟ing @allarinaresh @fariaabdullah2@chilakaprod @ramankam_19 @rajivchilaka @GopiSundarOffl @dopSURYAA @ChotaKPrasad @abburiravi @blaxmipati pic.twitter.com/mYr01qzImD
— Vamsi Kaka (@vamsikaka) March 22, 2023
ఉగ్రం టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

