రూ.100కు చేరినసన్నబియ్యం.. మూడు నెలల్లో 30 నుంచి 40 శాతం పెరిగిన కిలో ధర
తెలుగు రాష్ట్రాల్లో సన్నబియ్యం ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడికి చుకలు చూపిస్తున్నాయి. సోనామసూరి, బీపీటీ వంటి రకాలు కిలో రూ.90 నుంచి రూ. 100 వరకు పలుకుతున్నాయి. నిరుడు రిటైల్ దుకాణాల్లో సన్నరకం బియ్యం కిలోకు రూ.45 నుంచి రూ.50 చొప్పున, మేలు రకాలు రూ.60 నుంచి రూ.65 చొప్పున దొరికేవి.
- కరువును బూచిగా చూపి కృత్రిమ అక్రమ నిల్వలు
- తూతూమంత్రపు తనిఖీలతో సరిపెడుతున్న అధికారులు
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ట్రాల్లో సన్నబియ్యం ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడికి చుకలు చూపిస్తున్నాయి. సోనామసూరి, బీపీటీ వంటి రకాలు కిలో రూ.90 నుంచి రూ. 100 వరకు పలుకుతున్నాయి. నిరుడు రిటైల్ దుకాణాల్లో సన్నరకం బియ్యం కిలోకు రూ.45 నుంచి రూ.50 చొప్పున, మేలు రకాలు రూ.60 నుంచి రూ.65 చొప్పున దొరికేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. రానున్న ఆరేడు నెలల తర్వాత కొరత ఏర్పడుతుందం టూ.. ఇప్పుడే సన్నబియ్యం రేట్లు పూటకోసారి పెంచుతున్నారని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన పాత సన్న బియ్యం ధర ప్రస్తుత మారెట్ లో కిలో రూ. 100 మారును తాకింది.
25 కిలోల బియ్యం బస్తా ధర దాదాపు రూ. 2,200 నుంచి రూ. 2,700 వరకు పలుకుతున్నది. ఎల్ నినో ప్రభావం వల్ల దిగుబడులు తగ్గడం ఒక కారణమైతే, కొంతమంది వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సృష్టించి అక్రమంగా నిల్వలు ఉంచడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ధరలు అమాంతం పెరుగడంపై సామాన్యుల నుంచి నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. పౌరసరఫరాలశాఖ అధికారులు మొకుబడి తనిఖీలు, నామమాత్రపు హెచ్చరికలతో సరిపెడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
రేషన్, దొడ్డు బియ్యం పాలిష్ చేసి అక్రమాలు
కేవలం మూడు నెలల్లోనే 30 నుంచి 40 శాతానికి పైగా బియ్యం రేట్లు పెంచేశారు. పైకి మాత్రం మారెట్ లో బియ్యం లేవని చెప్తున్నారు. కానీ నగరాలు, పట్టణాల్లోని రిటైల్ దుకాణాల్లో బస్తాల కొద్దీ బియ్యం అందుబాటులో ఉన్నాయి. మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు లక్షల టన్నుల సన్న బియ్యాన్ని తమ గోదాముల్లో అక్రమంగా దాచినట్టు ఆరోపణలున్నాయి. కొన్నేండ్లుగా రాష్ట్రంలో వరి సాగు, సేకరణ భారీ స్థాయిలో కొనసాగుతున్నది. 2019-20లో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 72 లక్షల టన్నులు ఉండగా, 2025-26 నాటికి ఈ సంఖ్య 148.30 లక్షల టన్నులకు చేరుకున్నది. రాష్ట్ర అవసరాలకు మించి ధాన్యం ఉత్పత్తి ఎకువగా ఉంటే ధరలు తగ్గాలి. కానీ బియ్యం వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టించి దోపిడీకి తెరతీశారు. పెరిగిన ధరల అదను చూసుకుని హైదరాబాద్‌లాంటి నగరాల్లో కొందరు కేటుగాళ్లు రేషన్ బియ్యం, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంలో కలిపి విక్రయిస్తూ సరికొత్త దందాకు తెరలేపారు. దీనిపై సీఐడీ, టాస్‌ఫోర్స్ పోలీసులు పలువురు మిల్లర్లు, వ్యాపారులను అరెస్ట్ చేసి విచారణ చేస్తుండటం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది.
కరువును బూచిగా చూపి బ్లాక్ మార్కెట్
ప్రస్తుతం మారెట్లో అమ్ముతున్న సన్నబియ్యం గత సంవత్సరం ఖరీఫ్, అంతకంటే ముందు సీజన్లవి. అప్పుడు రాష్ట్ర అవసరాలకు మించి బియ్యం ఉత్పత్తి అయ్యింది. అంటే వాస్తవానికి ప్రస్తుతం ఎలాంటి కొరత లేదు. ఎల్ ప్రభావం రబీ ముఖ్యంగా 2027 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వచ్చే పంటల మీద ఉంటుంది. ఈ సమయంలో సాగు చేసిన పంటల దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నది. ఆ తర్వాత బియ్యం మిల్లింగ్‌కు మరో 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. అంటే సుమారు ఏడాది తర్వాత పరిస్థితిని వ్యాపారులు ఇప్పుడే ఉందంటూ బ్లాక్మారెట్ ఒక దశలో మిగులు ధాన్యాన్ని ఏం చేయాలో తోచక ప్రభుత్వం.. సన్నాలు, దొడ్డు రకాలను విడివిడిగా విక్రయించడానికి టెండర్లు పిలిచింది. 5 లక్షల టన్నుల సన్నవడ్లను వేలం వేయగా, కనీస ధరకు సైతం కొనుగోలు చేయడానికి వ్యాపారులు, మిల్లర్లు ముందుకు రాలేదు.
కానీ వారే ఇప్పుడు కృత్రిమ కొరతను సృష్టించి, బియ్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం విస్మయానికి గురిచేస్తున్నది. పంట పండించిన రైతులకు ఈ కృత్రిమ ధరల పెరుగుదల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, సామాన్య ప్రజలు అదనంగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తున్నది. భవిష్యత్తులో పంట దిగుబడి తగ్గుతుందనే అంచనాలను ఆసరాగా చేసుకొని ముందుగానే నిల్వలను పెంచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రిటైలర్లు సైతం అక్రమంగా నిల్వ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది రైస్ మిల్ల ర్లు ప్రైవేట్‌గా బియ్యం వ్యాపారం చేస్తున్నారు. వీరు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి హోల్ సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వా రి నుంచి రిటైలర్లు, కిరాణా దుకాణాలకు బస్తాలు చేరుతాయి. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో పెద్దమొత్తంలో బియ్యాన్ని ప్రైవేట్ గోదాముల్లో నిల్వ చేసి, అకడి నుంచి రిటైలర్లకు విక్రయిస్తున్న విషయం తనిఖీల్లో వెలుగుచూసింది. ఇలా గోదాములతో పాటు రిటైల్ వ్యాపారులు సైతం తమ దుకాణాల్లో భారీగా బియ్యాన్ని నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

నిబంధనలకు నీళ్లొదిలిన వ్యాపారులు
ప్రైవేట్ బియ్యం వ్యాపార కార్యకలాపాల కోసం ‘బి’ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రైతులు, మధ్యవర్తుల ద్వారా సేకరించిన ధాన్యం మిల్లింగ్ ఎంత? విక్రయించిన బియ్యం ఎంత? ఇంకా మిగిలిన నిల్వల వివరాలను నమోదు చేయాలి. అయితే సింహభాగం మిల్లర్లు ఇలాంటి రికార్డులను నిర్వహించడం లేదు. బియ్యం వ్యాపారులు లేదా దుకాణదారులు ఎకడి నుంచి బియ్యం తెచ్చారు? ప్రస్తుతం ఎంత నిల్వ ఉన్నది? అమ్మకపు ధర వివరాలను ప్రతిరోజూ ఒక బోర్డుపై రాసిపెట్టాలి. కానీ ఏ దుకాణంలోనూ ఈ నిబంధన పాటించడం లేదు. ఇక రిటైల్ దుకాణాల్లో బియ్యం ధరలు రోజుకో రకంగా ఉంటున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
ధరలు పెంచితే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్
బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మారెట్‌కు తరలించినా, అధిక ధరలకు విక్రయించి ప్రజలపై భారం మోపినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. బియ్యం ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఉత్తమ్ బేగంపేట కుందన్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అక్రమాల నిరోధానికి చేపట్టిన ప్రత్యేక చర్యలు, తనిఖీల పురోగతిని పౌర సరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంత్రికి వివరించారు. ప్రజలు ఎకువగా వినియోగించే బీపీటీ బియ్యం ధర కిలో రూ.66 మించకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే బియ్యం వ్యాపారులపై 12 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
కృత్రిమ కొరతపై కఠినంగా వ్యవహరించాలి
కరువు పరిస్థితుల నేపథ్యంలో బియ్యం అక్రమ నిల్వలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వచ్చే యాసంగిలో వరి సాగుకు అనువైన పరిస్థితులు లేవని ప్రభు త్వం ఇప్పటికే ప్రకటించిం ది. ఎల్ నినో పరిస్థితులతో వానకాలం వరి దిగుబడులు భారీగా తగ్గాయి. పండిన పంటను ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు ఎప్పుడూ ఊహించనంత ధరలకు కొనుగోలు చేశారు. దీంతో స్థానిక మిల్లర్లు తమవద్ద ఉన్న నిల్వలను గోదాముల్లో దాచి, మార్కెట్లో బియ్యం కొరత సృష్టించే ప్రమాదం ఉన్నది.
– నంద్యాల నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం
అక్రమార్కులపై నిఘా పెంచాలి
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుం డా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలి. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం నిల్వలకు కృత్రిమ కొరత సృష్టిస్తూ, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారుల లైసెన్స్ రద్దు చేయాలి. బియ్యం ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలి. రేషన్ కార్డుపై ప్రస్తుతం ఇస్తున్న 6 కేజీలను పెంచాలి.
– పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

