NBK 108 | స్టైలిష్ మాస్ అవతార్‌లో బాలకృష్ణ.. ఎన్బీకే 108 ఫస్ట్ లుక్స్ వైరల్
NBK 108 | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఎన్బీకే 108 (NBK 108). ఇవాళ ఉగాది పండగ సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఎన్బీకే 108 నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
NBK 108 | టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఎన్బీకే 108 (NBK 108). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ ఉగాది పండగ సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఎన్బీకే 108 నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సారి మీ ఊహలకు అందని విధంగా.. అంటూ బాలకృష్ణ కోరమీసంతో ఉన్న లుక్‌ను షేర్ చేసింది షైన్ స్క్రీన్ బ్యానర్.
అన్న దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ సారి కూడా బాలకృష్ణ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తున్నాడు. బాలకృష్ణ చేతిపై టాటూ కనిపిస్తోంది. అభిమానులు ఖచ్చితంగా ఇదివరకెన్నడూ చూడని విధంగా ఎన్బీకే 108లో బాలయ్య కనిపించబోతున్నాడని తాజా స్టిల్స్ తో అర్థమవుతోంది. రెండు పోస్టర్లు మాస్ అప్పీల్లో కనిపిస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇక మీ అంచనాలకు మించి.. అంటూ జోడించిన ట్యాగ్ లైన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ పోస్టర్లు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఎన్బీకే 108 టీంతో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇప్పటికే జాయిన్ అయింది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. పాపులర్ నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు.
అన్న దిగిండు..
అన్న దిగిండు 🔥
ఈసారి మీ ఊహకు మించి😎అందరికీ ఉగాది శుభాకాంక్షలు 🤗
Here’s the First Look of Natasimham #NandamuriBalakrishna garu from #NBK108 💥#NBKLikeNeverBefore @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/dYa3CGi5OF
— Anil Ravipudi (@AnilRavipudi) March 22, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

