నల్లగొండ రూరల్, ఏప్రిల్ 13: యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సీఏం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. పీఏసీఏస్ గొల్లగూడ ఆధ్వర్యంలో బుధవారం ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆయన పాలాభిషేకం చేసి మాట్లాడారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయంచాలన్నారు. కేసీఆర్ రైతులకు అండగా మరోసారి నిలిచాడని పేర్కొ న్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, వైస్ చైర్మన్ కృష్ణ, డైరెక్టర్లు వెంకన్న, ఆంజయ్య, వెంకట్‌రెడ్డి, వెంకన్న, విమలమ్మ, శంకర్, నాగయ్య, వెంకట్‌రెడ్డి, పులేందర్, కిషన్‌రావు, నర్సయ్య, యాదయ్య ఉన్నారు.
కనగల్ : ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి బుధవారం కనగల్ మండలకేంద్రంలో ఎంపీపీ కరీంపాషా, పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ సహదేవరెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, సైదులు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చనగాని నాగరాజు టీఆర్ఎస్ నాయకులు యాదయ్య, సుధాకర్‌రెడ్డి, కోటేశ్, శంకర్నాథ్, భాస్కర్‌రెడ్డి, జాగల్, యాదగిరి, పర్వతాలు, కిరణ్, గోపాల్, సైదులు పాల్గొన్నారు.
తిప్పర్తి : రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలో రైతు బంధు సమితి, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మీలింగారావు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శ్యాంసుందర్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి, సర్పంచ్ రమేశ్, వైస్ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నాగేశ్వర్రావు, రేణుకాలక్ష్మయ్య, సత్యనారాయణ, రామచంద్రు, మోష, సైదులు, గిరి, అంజయ్య, వెంకట్‌రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.
మునుగోడు : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మునుగోడు చౌరస్తాలో బుధవారం పటాకులు కాల్చి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ యాసంగి వడ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో మరోసారి రైతు బాంధవుడిలా మారారని ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కుమారస్వామి, కృష్ణ, నర్సింహ, అశోక్, నర్సింహ, లోకేశ్, సురేశ్, రవి, భిక్షం, మల్లయ్య, నర్సింహ, స్వామి, వెంకన్న, ప్రణయ్, ప్రవీణ్, భాస్కర్ పాల్గొన్నారు.
కట్టంగూర్ : ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై బుధవారం టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ సైదులు, ఉప సర్పంచ్ అంతటి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ జానకిరెడ్డి, నాయకులు నర్సింహ, వెంకటేశ్వర్లు, రమేశ్, యాదయ్య, వెంకన్న, భిక్షం, మనోహర్, నాగరాజు, నగేశ్, సాయి, గోపి, రామకృష్ణ పాల్గొన్నారు.
కట్టంగూర్(నకిరేకల్) : ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి నకిరేకల్‌లో బుధవారం సీఎం ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ ధనలక్ష్మి, పార్టీ నకిరేకల్, కేతేపల్లి మండలాధ్యక్షులు నవీన్‌రావు, వెంకట్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సైదిరెడ్డి, కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు.
హాలియా : కేసీఆర్ ప్రకటనను హర్షిస్తూ సాగర్ నియో జకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం హాలియా, రామడుగు తదితర గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు ముత్యాలు, రామడుగు సర్పంచ్ వెంక టరమణారెడ్డి, నాయకులు వర్రా వెంకట్‌రెడ్డి, లింగయ్య, అన్వరుద్దీన్, వెంకటయ్య, సైదులు, సురభి రాంబాబు, మండల యూత్ అధ్యక్షుడు నాగరాజు, రవి, జనకిరా ములు, అనిల్, సీకే రమేశ్ పాల్గొన్నారు.
నిడమనూరు : మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, నాయకులు రవియాదవ్, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు శంకర్,రవి, అల్వాల కళావతి, వెంకటరమణ, సత్యనారాయణరెడ్డి, సత్యనారాయణ, దాసు, శ్రీలత పాల్గొన్నారు.
గుర్రంపోడు : కేసీఆర్ చిత్రపటానికి బుధవారం టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, చంద్రశేఖర్‌రావు, ఉపాధ్యక్షుడు వెలుగు రవి, పృథ్వీరాజ్ గౌడ్ పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్ : మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ధాన్యపు రాసుల మధ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పిడిగం నాగయ్య, మండల ప్రధాన కార్యదర్శి తిరుమల్, కోటిరెడ్డి, నాసర్‌రెడ్డి, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, బిచ్యానాయక్, దేవ్నాయక్, రవినాయక్, రూప్లానాయక్, మాన్యానాయక్ పాల్గొన్నారు.
త్రిపురారం : రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు ఇస్లావత్ రాంచంద్రనాయక్ అన్నారు. బుధవారం త్రిపురారం రైతువేదిక వద్ద కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు నరేందర్, ధనలక్ష్మి, వనజ, వెంకటాచారి, అనంతరెడ్డి, మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, శ్యాంసుందర్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, దస్తగిరి పాల్గొన్నారు.
పెద్దవూర : సీఎం కేసీఆర్ ప్రకటనతో బుధవారం మండల కేంద్రంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు లింగారెడ్డి,నరేందర్‌రెడ్డి, సర్పంచ్ లింగయ్య, బషీర్, చారి, కిషన్, ఎస్సీ సెల్ రవినాయక్, లక్ష్మయ్య, సుధాకర్‌రెడ్డి, బాషా పాల్గొన్నారు.