అనంతగిరి డిసెంబర్ 7: స్థానిక ఎన్నికల్లో హామీల పర్వం మొదలైంది. తనని గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు సొంత ఖర్చుతో గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశాడు. సర్పంచ్ ఎన్నికల్లో తనని గెలిపిస్తే ఐదేళ్లు నిస్వార్థ సేవ చేస్తానని హామీ ఇచ్చాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం చనిపల్లి గ్రామం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నల్ల భూపాల్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలలో తన మేనిఫెస్టో శనివారం రాత్రి విడుదల చేశారు.
గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఉచిత మంచినీటి కోసం ఒక మినరల్ వాటర్ ప్లాంట్ అందిస్తామని, గ్రామంలోని ఆడబిడ్డల పెళ్లికి కానుకగా తన సొంత నిధులు 25,000 రూపాయలు సహాయం, వృద్ధులకు, వికలాంగులకు, పెన్షన్ దారులకు అదనంగా 2,000 రూపాయలు,ప్రతి పేద కుటుంబ గృహ నిర్మాణానికి 50 సిమెంట్ కట్టలు, 1 నుండి 12 వ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులందరికీ స్కూల్ యూనిఫామ్స్, బుక్స్, 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, గుండె పోటు మరణాలను నివారించేందుకు గ్రామంలో ఒక ఇంజెక్షన్ ను ఉచితంగా అందుబాటులో ఉంచుతానాని తెలిపారు.
5సంవత్సరాలు పాటు యువత చదువులో రాణించి ఉన్నత స్థితికి వెళ్లాలని వారి కోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు, దురదృష్టవశాతు ఎవరు మరణించిన వారి కుటుంబానికి తక్షణ దహన ఖర్చుల నిమత్తం 15,000 రూపాయలను ఆర్థిక సహాయం, గ్రామంలో ఉచిత కరెంట్ ఫ్రీజర్ (శవపేటికను) అందుబాటులో ఉంచుతానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గ్రామానికి వచ్చే నిధులలో ఒక్క రూపాయ కూడా అవినీతి జరగకుండా తనకు వచ్చే గౌరవ వేతనం, తన సొంత నిధులను ఉపయోగించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించి ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.